AP: నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి ఆరోపించారు. ‘టీచర్ల నియామకాలు వందశాతం పారదర్శకంగా జరిగాయి. అక్రమాలంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తే ఎవరూ నమ్మరు. క్రీడాకారుల కోటా ఉద్యోగాలను పారదర్శకంగా ఇచ్చాం. కులాలు, మతాల మధ్య చిచ్చు విఫలంతో నిరుద్యోగులపై పడ్డారు. జగన్ కుట్రలను నమ్మే పరిస్థితుల్లో ఎవరూ లేరు’ అని విమర్శించారు.