MHBD: తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన ఎలగం సదానందం ఈనెల 18న బట్టలు అమ్ముకునేందుకు వెళుతుండగా నెల్లికుదురు శివారులో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి అల్లుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.