HYD: ఉస్మానియా, డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయాల్లో దూరవిద్య చదివే విద్యార్థులకు అపార్ కార్డు అందుబాటులోకి రానుంది. ఆధార్ తరహాలో ప్రత్యేక నంబర్‌తో ఉండే ఈ కార్డు ద్వారా విద్యార్థుల అకాడమిక్ వివరాలు డీజీ లాకర్లో భద్రంగా నిల్వ ఉంటాయి. డిగ్రీ, పీజీ పూర్తిచేసిన తర్వాత ఉద్యోగాలు, విదేశీ విద్య, పరిశోధన అవకాశాల్లో విద్యార్హతల ధ్రువీకరణ సులభమవుతుంది.