BHPL: సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో ఏర్పాటు చేసిన ఆహార స్టాళ్లలో ఆహార భద్రత ప్రమాణాలపై అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుణ్ రెడ్డి, ధర్మేంద్ర స్టాల్ నిర్వాహకులకు పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, తాగునీటి వినియోగంపై సూచనలు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.