ELR: భీమడోలు వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ బీ.రమాదేవి సూచించారు. ఈనెల 31 వరకు ప్రతి రోజు ఉ.11 గంటల నుంచి సా.4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. తరచూ తగినంత నీరు, మజ్జిగ, ORS ద్రావణాలు తీసుకోవాలన్నారు. అస్వస్థతకు గురైతే తక్షణం వైద్యులను సంప్రదించాలన్నారు.