KNR: కరీంనగర్ నగరంలోని ఆదర్శనగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గంగిశెట్టి లక్ష్మణ్ (60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కరీంనగర్ రూరల్ సీఐ ఏ.నిరంజన్ రెడ్డి తెలిపారు.