ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటరమణ, స్థానిక టీడీపీ నేతలు పట్టణ ప్రధాన రహదారులను శుభ్రం చేశారు. మూడు రోజులు పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాలలో ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తామని అలాగే ప్రజలందరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.