NRPT: కొడంగల్ పట్టణ శివారులోని ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని వీధికుక్కలు పిక్కుతిన్న ఘటన వెలుగు చూసింది. శనివారం ఉదయం అటుగా వెళుతున్న కొందరు గమనించి దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలుసుకొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.