AP: జనగామ జిల్లా బండ్లగూడెంలో విషాదం నెలకొంది. స్థానిక శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కోనేరులో రెండు మృతదేహాలు లభ్యం కావడం కలకలం రేపింది. మృతులను ఆలయ అర్చకుడు నరసింహాచార్యులు, ఆయన కుమారుడు పవన్‌గా పోలీసులు గుర్తించారు. వారు ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.