W.G: నరసాపురం మండలం సీతారాంపురం నార్త్ గ్రామంలోని రామాలయం వద్ద ఉన్న విద్యుత్ స్తంభం గాలుల ధాటికి ఒక్కసారిగా విరిగి నేలకొరిగింది. ఆ సమయంలో పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు . విద్యుత్ స్తంభం విరిగిపడటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.