నిజామాబాద్ ఆర్టీసీ బస్టాండ్లోని సులబ్ కాంప్లెక్స్ సమీపంలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని సెక్యూరిటీ సిబ్బంది గమనించి 108కి సమాచారం అందించగా అప్పటికే మరణించినట్లు అంబులెన్స్ సిబ్బంది ధ్రువీకరించారన్నారు. మృతుడి ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు.