WNP: ఆత్మకూరు మండలంలోని ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఏపీఎం పారిజాత శుక్రవారం తెలిపారు. పిన్నంచర్ల, జూరాల, మొట్లంపల్లి, మేడేపల్లి కేంద్రాల్లో ఇప్పటి వరకు 500 బ్యాగుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. జూరాల, మేడేపల్లి కేంద్రాల్లో రేపటికి కొనుగోలు ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.