SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి శివారులో శుక్రవారం గ్రామ శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో రాకేష్ అనే యువకుడు ఎల్లారెడ్డిపేట నుంచి సిరిసిల్ల వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. పోలీసులను చూసి, వాహన వేగాన్ని పెంచాడు. బస్సును దాటే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టాడు. గాయపడిన రాకేష్‌ను ఆసుపత్రికి తరలించారు.