AP: రాష్ట్రంలోని మున్సిపాలిటీలను సంపూర్ణంగా పరిశుభ్రం చేయడమే లక్ష్యంగా మంత్రి నారాయణ ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాలుగు వారాల పాటు సాగే ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా, మంత్రి స్వయంగా మున్సిపల్ కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి, డివైడర్లకు పెయింట్ వేశారు. అనంతరం ఆయన అన్న క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం చేశారు.