ASR: హుకుంపేట మండలంలోని పాడేరు-పెదబయలు ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మఠం పంచాయతీ డురువీధి గ్రామానికి చెందిన పాంగి ప్రవీణ్‌ను అజాగ్రత్తగా వచ్చిన స్కూటీ ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం వాహనదారుడు పరారైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన బాలుడిని విశాఖ KGHకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.