NGKL: గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని వీధికుక్కలు పిక్కుతిన్నాయి. ఈ ఘోరమైన ఘటన కొడంగల్ పట్టణ శివారులోని ఎస్సార్ పెట్రోల్ బంక్ వద్ద వెలుగు చూసింది. శనివారం ఉదయం అటుగా వెళుతున్న కొందరు గమనించి దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలుసుకొనేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.