AP: ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తొలి వారంలో రోడ్ల పరిశుభ్రత, రెండో వారంలో కాల్వలను శుభ్రపరచడం, మూడో వారం ఇళ్లు, దుకాణాల వద్ద చెత్తను వేరుచేసేలా అవగాహన, నాలుగో వారం పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరిచేలా కార్యక్రమం ఉంటుందన్నారు. పారిశుద్ధ్యం బాగుండాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరని చెప్పారు.