KDP: తొండూరు(M) ఇనగలూరులోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల HM విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ పాఠశాలలో నాణ్యమైన విద్య, అర్హత కలిగిన ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని, కాబట్టి మీ పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు.