W.G: తాను ఏవిధమైన కొత్త పార్టీ పెట్టడం లేదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. తాను పార్టీ పెడుతున్నట్లుగా వస్తున్న అసత్య ప్రచారాలను తీవ్రంగా ఖండించారు. ‘తెలుగువీర లేవరా’ అనేది కేవలం న్యాయపరమైన ఇబ్బందులు పడేవారికి సలహాలు ఇవ్వడానికేనని పేర్కొన్నారు.