BPT: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. జిల్లా పరిపాలనలో అందించిన విశిష్ట సేవలు, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన చొరవ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కనబరిచిన సమర్థతకు గుర్తింపుగా ఈ అవార్డు అందించారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI) ఛైర్మన్, చేతులతో అవార్డు అందుకున్నారు.