HNK: ధర్మసాగర్ పోలీసుల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనిఖీల పేరుతో కానిస్టేబుల్ ఎం.డి. సలీం బ్రీత్ అనలైజర్‌తో వాహనదారులపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబంతో వెళ్తున్న జర్నలిస్టుపై కూడా ఇలాంటి ప్రవర్తన జరిగిందని స్థానికులు తెలిపారు. ఉన్నతాధికారులు స్పందించాలని వాహనదారులు కోరుతున్నారు.