VZM: బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో జరుగుతున్న రీ సర్వే కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ శనివారం పరిశీలించారు. గ్రౌండ్ ట్రూధింగ్ జరుగుతున్న సమయంలో రైతుకు సమాచారం ఇవ్వాలని, రైతు ద్వారా ఈ కేవైసీ తీసుకోవాలని సూచించారు. ఎటువంటి అరమరకలు లేని ఖచ్చితమైన కొలతలతో కూడిన భూ సర్వే రైతులకు అందజేయాలన్నారు.