PLD: నరసరావుపేట మల్లమ్మ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ మండలి ద్వారా అందిస్తున్న పథకాలపై ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అవగాహన కల్పించారు. నిర్మాణ కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.