TPT: వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. భక్తులకు బాదంపాలు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందిస్తున్నామని వెల్లడించారు. రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నామన్నారు. అత్యవసర సమయాల్లో 15 నిమిషాల్లో ఉప్మా సిద్ధం చేసి పంపిణీ చేస్తున్నామని తెలిపారు.