ADB: వ్యవసాయ అధికారిణిని సాయి కీర్తనను కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడిన నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ సీఐ రమేష్ శుక్రవారం తెలిపారు. విలేఖరి పేరుతో నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డారని వెల్లడించారు. బాధితులు ఎవరైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.