సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9:30 గంటలకు గణేష్ సర్కిల్లో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జాయింట్ కలెక్టర్ ప్రారంభించనున్నారు.