MDK: కౌడిపల్లి మండలం సాలబత్ పూర్ గ్రామ పరిధిలోని రూప్ సింగ్ తండాలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి మామిడి తోటలోనే జీవనం సాగిస్తున్న 14 ఏళ్ల రాజేశ్, నిద్రలోనే పాముకాటుకు బలయ్యాడు. రాత్రి బయట పడుకున్న సమయంలో పాము కరవడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.