AP: TDP కేంద్ర కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా TDP సుప్రీమో CM చంద్రబాబు, మంత్రి లోకేష్ జెండా ఎగురవేసి.. పార్టీ వ్యవస్థాపకుడు NTR విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, కేంద్రమంత్రి పెమ్మసాని తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.