SS: జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని, విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. పుట్టపర్తిలోని కలెక్టరేట్లో నిర్వహించిన ఎన్.కార్డ్ (N.CORD) కమిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి రవాణాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించాలని సూచించారు.