TG: BRS సభ్యులు సభను అడ్డుకోవడానికే అసెంబ్లీకి వస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. సీఐడీ విచారణకు ఆదేశించినా హౌస్ కమిటీ అని పట్టుబట్టడం వెనుక బ్లాక్ మెయిల్ రాజకీయం ఉందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పంచిన భూములను ధరణి పేరుతో దోచుకున్నారని, బాలానగర్ భూ దోపిడీపై హౌస్ కమిటీకి BRS సిద్ధమా? అని సవాల్ విసిరారు.