KRNL: రాయలసీమ కరవు మండలాల జాబితాలో ఆదోని మండలానికి చోటు లేకపోవడం రైతుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. వర్షాకాలంలో పంటలు దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను పరిశీలించకుండా జాబితా రూపొందించారని విమర్శిస్తున్నారు. కరవు గుర్తింపులో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.