ASF: సిర్పూర్(U) మండలం మారుగూడ గ్రామంలో కోవా అర్జున్ అనే రైతు తన వ్యవసాయ భూమిలో SI రామకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో 8 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80,000 ఉంటుందని అంచనా వేశారు. నిందితుడు కోవా అర్జున్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.