సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబోలో ‘వారణాసి’ మూవీ తెరకెక్కుతోంది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో మహేష్, ప్రియాంకలపై ఓ పాటను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో జరిగే ఈ పాట షూటింగ్ కోసం భారీ సెట్‌ను వేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల కానుంది.