KDP: ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తిరుమల నుంచి ప్రత్యేకంగా రవాణా చేసిన 85 వేల లడ్డూలు ఇప్పటికే క్షేత్రానికి చేరుకున్నాయి. లడ్డూల ప్యాకింగ్ పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. తిరుమలతో పాటు స్థానిక ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అహోరాత్రులు శ్రమిస్తున్నారు.