ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో 550 సిక్సర్ల మైలురాయిని దాటిన తొలి భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన ప్రపంచంలోని 9వ ఆటగాడిగా నిలిచాడు. వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. IPL-2026లో KKRతో జరిగిన మ్యాచ్లో రోహిత్ ఈ ఘనత సాధించాడు.