AP: అనకాపల్లి జిల్లాలోని పెదబోదుగల్లంలో TDP ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి సుదీర్ఘకాలంగా పార్టీనే నమ్ముకున్న పలువురు సీనియర్ కార్యకర్తలను హోం మంత్రి అనిత సత్కరించారు. అనంతరం వారి కాళ్లకు నమస్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ విజయం సాధించడంలో కార్యకర్తల కృషి, పట్టుదల అంతులేనిదని చెప్పారు.