KMR: జిల్లా పరిధిలోని మహమ్మద్ నగర్ మండలంలోని తెల్గాపూర్ గ్రామ సర్పంచ్ మేఘన నగేష్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెల్లాపూర్ గ్రామంలో ఐస్క్రీమ్ ఆటోలు, ఐస్క్రీమ్ బండ్ల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధిస్తూ.. ఫ్లెక్సీ రూపంలో ఓ ప్రకటన విడుదల చేశారు. చిన్నపిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందన్నారు.