NRPT: మోమినాపూర్ హైస్కూల్లో బాలికపై జరిగిన అఘాయిత్యం కేసులో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయుడితో పాటు, సాక్ష్యాలను దాచిపెట్టిన మరో టీచర్, వీడియోలు షేర్ చేసిన నలుగురు ఉన్నారు. నిందితులపై పోక్సో, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.