MDCL: అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్, సాయిరెడ్డి నగర్ కాలనీలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్‌గా కవిత, వైస్ ప్రెసిడెంట్‌గా జొనాథన్, జనరల్ సెక్రటరీగా పుష్పావతి, ట్రెజరర్‌గా ముక్తికుమార్, జాయింట్ సెక్రటరీగా అవినాష్ బాధ్యతలు స్వీకరించారు. కొత్త కమిటీ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.