SRPT: ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. ఈరోజు సూర్యాపేటలో మాట్లాడుతూ.. రైతులకు భరోసా, మహిళలకు ఆర్థిక సాయం వంటివి నేటికీ నెరవేరలేదన్నారు. తెలంగాణలో హామీలు అమలు చేయకుండా కేరళలో రేవంత్రెడ్డి బోగస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేరళలో మళ్లీ వామపక్ష ప్రభుత్వమే వస్తుందని అన్నారు.