ముంబైలోని వాంఖడే స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామంగా ప్రసిద్ధి చెందింది. చిన్న బౌండరీలు, ఫాస్ట్ ఔట్‌ఫీల్డ్ కారణంగా ఇక్కడ భారీ స్కోర్లు నమోదవుతాయి. ప్రారంభంలో పేసర్లకు కొత్త బంతితో కొంత స్వింగ్ లభిస్తుంది. రాత్రి మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిచిన జట్లు మొదట బౌలింగ్ ఎంచుకుంటాయి. ఈ గ్రౌండ్లో సగటు ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్: 180.