ATP: కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన శ్రీధర్ కుమార్తె నాగ కౌస్తుభ ఇంజినీరింగ్ చదువు కోసం ఫీజు చెల్లించడానికి ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదివారం లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ప్రజా వేదికలో మాజీ కౌన్సిలర్ రాధికా రాణి సమక్షంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలన్నారు.