SDPT: మెదక్ ఏఎస్సీగా విధులు నిర్వహిస్తున్న మహేందర్ ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో హుస్నాబాద్ అదనపు కమిషనర్గా పనిచేసిన ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బంది ఆయనను సన్మానించారు.