VKB: మర్పల్లి మండంలోని ఏడో వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ రామేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణంతో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, తద్వారా గ్రామాభివృద్ధి వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. తాగునీటి సమస్య పరిష్కారం, మురికి కాలువల నిర్మాణం, వీధిలైట్ల ఏర్పాటు వంటి మౌలిక వసతులకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.