TG: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వం పరోక్ష విమర్శలు చేశారు. మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు వస్తున్నాయని.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు నిధులు రావట్లేదని ఆరోపించారు. ప్రభుత్వం అంటే మంత్రులు మాత్రమే కాదని.. ప్రభుత్వం ఏం చేసినా ఖమ్మం, కొడంగల్ మాత్రమే వెళ్తున్నాయని.. తాము తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోకూడదా? అని ప్రశ్నించారు.