NDL: నంద్యాల పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంత్రి ఎన్ఎండీ ఫారుక్ ఘనంగా నిర్వహించారు. పార్టీ కోసం తొలి నుంచి శ్రమిస్తున్న సీనియర్ కార్యకర్తలను ఆయన సన్మానించారు. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ, కేవలం 9 నెలల్లోనే అధికారం సాధించి చరిత్ర సృష్టించిందని ఆయన కొనియాడారు.