BHNG: రామన్నపేట నియోజకవర్గాన్ని పునరుద్ధరించాలని, గత కాలం నుంచి వెనకబడిన రామన్నపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సీపీఎం మండల కార్యాలయంలో జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. పాత నియోజకవర్గంగా వెలిసిలిన రామన్నపేట ఇవాళ మండల కేంద్రంగా ఉందని అన్నారు.