VSP: కస్టమర్ల నుంచి ఓటీపీలు సేకరించి సుమారు 30 గ్యాస్ సిలిండర్లతో పరారైన డెలివరీ బాయ్ అప్పారావును పోలీసులు అరెస్ట్ చేశారు. మణికంఠ గ్యాస్ ఏజెన్సీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వినియోగదారులతో చనువుగా ఉండి ఓటీపీలు సేకరించి సిలిండర్లను దారి మళ్లించినట్లు విచారణలో వెల్లడైంది.