ASR: రాజకీయ లబ్ధి కొరకు అమరావతిని కూటమి ప్రభుత్వం పావుగా వాడుకుంటుందని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం అరకులోయ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి కొరకు మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం తమ వారి లబ్ధి కొరకు అమరావతి నిర్మాణం చేపడుతుందని ఆరోపించారు.