KKD: కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పేర్కొన్నారు. రౌతులపూడి మండలం, ములగపూడి గ్రామంలోని SC పేటలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆమె ప్రారంభించారు. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నూతన పాఠశాలను ప్రారంభించామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి రంగాన్ని అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు.